తెలుగు నూతన నందన నామ సంవత్సరమునకు
స్వాగతం
తెలుగు వత్సర మందు వెలుగులు విరజిమ్మి
తెలుగు ప్రజలకెల్ల తేజమిచ్చి ,
ప్రకృతి విలయంపు వికృత చేష్టలు
దరికి రానీయక దయను జూపి,
అదను దప్పకుండ పదునైన వర్షముల్
అవనియందు గురిసి యాదరమున,
అధిక ధరల పీడ అంతమై పోవంగ
విరివిగా పంటలు ధరణి పండి,
సకల జనులు ఇలను సుఖ సంతసంబుల
మెలగు నట్లు జేసి మేలు లిచ్చి
ఆదరమున నీవు ఆదుకొనరావమ్మ
నందనమ్మ నీకు వందనములు.
నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలతో
రమణయ్య మాచిరాజు.