Container Icon


తెలుగుప్రపంచ మహాసభల  సందర్భముగా తెలుగు భాషాభిమానిగా ఇది నా హృదయ స్పందన .ప్రతితెలుగు సోదరుడు తెలుగు భాషాభి వృధ్ధికి తన వంతు సహకారం అందజేయాలని కోరు కొంటూ.  మాచిరాజు రమణయ్య .
// ఉగ్గుపాలు త్రాపి ఊయలలూపుచూ
       అమ్మ నేర్పినట్టి ఆది భాష,
ఆంధ్రభోజుండైన ఆ కృష్ణ విభవుండు
  సాటి లేదన్నట్టి  మేటి భాష ,
తెలుగు కవుల నోట పలుకులై జాల్వారి
            కావ్యాల నిచ్చిన దివ్య భాష ,
దేశ దేశాలలో దేదీప్యమానమై
                 రాజిల్లనట్టిదీ రాజభాష,
పంచదారకన్న పాల్మీగడలకన్న
జుంటి తేనెకన్న జున్నుకన్న
అమ్మమనసుకన్న కమ్మనిదీ భాష
తెలుగు వారి భాష తెలుగుభాష //

అట్టి భాష పలుక  అవమానమని యెంచి
అన్య భాష కొరకు అర్రు జాపి
తెలుగు వారు నేడు తెగ బడు చున్నారు
సిగ్గు సిగ్గు  సిగ్గు   సిగ్గు సిగ్గు  .

తెలుగు జాతి మనది తెలుగువారము మనము   
తెలుగు  మాట లాడి  తెగువ జూపి
తెలుగు భాష కొరకు అలుపన్నదెరుగక
పాటు పడగ  వలయు నేడుమనము. 


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

1 comments:

Padmarpita said...

చివరి నాలుగు లైన్లు చాలా నచ్చాయండి.

Post a Comment