నా మాతృ భూమి
గత జీవుడగు పతిన్ బ్రతికించుకున్నట్టి
సావిత్రి భారత సతియె గాదె,
తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చె
చంద్రమతి పవిత్ర పడతి గాదె,
కులసతీత్వమునకై గుండాన దూకిన
సీత భారత ధరా జాత గాదె,
కినిసి దుర్మద కిరాతుని బూది గావించె
దమయంతి భారత రమణి గాదె,
సప్త సాగర పరివేష్టి తోర్వీతలము
భరత జాతి పాతి వ్రత్య ప్రవిమలంబు
భావ సంపదకిది మహా పంట భూమి
అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదె.
0 comments:
Post a Comment