Container Icon

తెలుగు నూతన నందన నామ సంవత్సరమునకు స్వాగతం.


తెలుగు నూతన  నందన నామ  సంవత్సరమునకు 
                          స్వాగతం
 తెలుగు వత్సర మందు వెలుగులు విరజిమ్మి
           తెలుగు ప్రజలకెల్ల తేజమిచ్చి ,
 ప్రకృతి  విలయంపు  వికృత  చేష్టలు
           దరికి రానీయక దయను జూపి,
 అదను దప్పకుండ  పదునైన వర్షముల్
          అవనియందు గురిసి యాదరమున,
అధిక ధరల పీడ అంతమై పోవంగ
         విరివిగా  పంటలు  ధరణి పండి,
సకల జనులు ఇలను  సుఖ సంతసంబుల
మెలగు  నట్లు  జేసి  మేలు లిచ్చి
ఆదరమున  నీవు  ఆదుకొనరావమ్మ
నందనమ్మ  నీకు  వందనములు.
నూతన  తెలుగు  సంవత్సర  శుభాకాంక్షలతో
రమణయ్య మాచిరాజు.  

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నవరసాలలో శ్రీ రామచంద్రుడు


            నవరసాలలో  శ్రీ రామచంద్రుడు
కడునొప్ప జానకీ   కళ్యాణ శుభలగ్న                         
               కాలోత్సవంబు  శృంగారరసము,
పట్టాభిషేక సంభ్రమ వేళ ముని వృత్తి
              జనుమన్నజనుటయే శాంతి రసము,
తను నర మాత్రుగా దలచు తాటకనేయ
              నట్టహాస స్ఫూర్తి హాస్యరసము,
పాదరేణువు సోకి పాషాణ మెలమితో  
              పొలతియై నిలుచుట ద్భుతరసంబు,
మాయా మృగంబైన మారీచు గనుగొని 
              భయదాస్త్ర మేయుట భయరసంబు,
కడగి వారథి మీద కదిసి లక్ష్మణుచేతి 
               విల్లంబు గొను వేళ వీర రసము,
 తన బాణహతి బద్ధ దైత్యుల వికృ తాంగ 
               భావంబుజూడ భీభత్స రసము,
రాణివాస ద్రోహి రావణాసురు బట్టి
            రణ వీధి ద్రుంచుట రౌద్ర రసము,
అల విభీషణుని  లంకాధిపు చేయుచో
          రూడికి నెక్కు కారుణ్య రసము,    
       నవ రసంబులు నీయెడ నాటు కొనియె
       దశరథేశ్వర   పుత్ర    సీతా  కళత్ర
       తారక బ్రహ్మ  కౌసల్య  తనయ రామ
       రాజ దేవేంద్ర  పట్టాభి  రామచంద్ర.
సేకరణ : మాచిరాజు రమణయ్య 

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నా మాతృ భూమి


                   నా మాతృ భూమి
 గత జీవుడగు పతిన్ బ్రతికించుకున్నట్టి
                            సావిత్రి భారత సతియె గాదె,
తన సత్య మహిమచే  దావాగ్ని చల్లార్చె     
                           చంద్రమతి పవిత్ర పడతి గాదె,
కులసతీత్వమునకై గుండాన దూకిన
                             సీత భారత ధరా జాత గాదె,
కినిసి దుర్మద కిరాతుని బూది గావించె
                       దమయంతి భారత రమణి గాదె,
          సప్త సాగర పరివేష్టి  తోర్వీతలము
          భరత జాతి పాతి వ్రత్య ప్రవిమలంబు
          భావ సంపదకిది మహా పంట భూమి 
           అఖిల దేశాలకిది  ఉపాధ్యాయి కాదె.       

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

కలియుగములో మహాదాత రాయనభాస్కరుడు.


     కలియుగములో మహాదాత  రాయనభాస్కరుడు.
చేకొని రాయని బాచడు  కా, కా,లు వ్రాయు కాలమునాడే
లా కేత్వమియ్యనేరడు దా కును కొమ్మియ్యడిట్టి ధన్యులు గలరే

ఏవ్రాలైనను వ్రాయును  నా వ్రాయడు  వ్రాసెనేని నవ్వుచునైనన్
సి వ్రాసి తా వడియ్యడు భావగ్నుడురాయనార్యభా స్కరుడేలమిన్.

సేకరణ: మాచిరాజు రమణయ్య.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS


                           దోమ గర్వం
పరగగ నాల్గు పాదములు బాగుగ తుండము ఘీంక్రుతంబుమా
కిరువురకున్ సమంబె మరి ఎక్కువ యొక్కటి పక్ష యుగ్మ ఖే
చరుడను  నాకు సామ్య మొక సామజమా? యని దోమ పల్కున
ట్లరయ మహాను భావులను నల్పుడు నోరికొలందు లాడెడిన్.                           

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

దండం దశగుణం భవేత్


                          దండం దశగుణం భవేత్

శ్లో= వి శ్వా మిత్రాహి  పశుషు  కర్థమేషు  జలేషుచ,
     తమసి వార్థక్యే దండం దశ గుణం భవేత్.
అర్థము:;   వి=పక్షి, శ్వ=కుక్క, అమిత్ర=శత్రువు, అహి=పాము, పశుషు=పశువులను, కర్థమేషు=బురదలోను,
జలేషుచ=నీటిలోను, అంధ్వే=గ్రుడ్డితనములోను, తమసి=చీకటిలోను,
 వార్థక్యే=వార్థక్యములోను,  దండం=(చేతి) కర్ర,
దశగుణంభవేత్ = పది  విధాలుగా ఉపయోగపడుతుంది.
తాత్పర్యము: ౧.కర్ర చేతులో వుంటే పక్షులను అదిలించి కొట్టవచ్చును ,                             
 ౨.వీదికుక్కలను అదిలించవచ్చును,
 ౩.శత్రువులను భయపెట్టవచ్చును,
 ౪.పాములను కొట్టవచ్చును,
   ౫.పశువులను అదిలించవచ్చును,
  ౬.బురదలోనడచునప్పుడు   ఉపయోగపడుతుంది.    
  ౭. నీటిలోను  ఉపయోగపడుతుంది.
 ౮. గ్రుడ్డితనంలోను , ౯.ముసలితనంలోను, ౧౦. చీకటిలోను,
  దండము ఉపయోగపదుతుంది.    
సేకరణ ; మాచిరాజు రమణయ్య.   cell.   9440845875        

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

అష్టకష్టములు


                                       అష్టకష్టములు
అరయగ  పరదేశ యాత్ర సేయుట యొండు
                        తనకుతాను వండుకొనుట రెండు
కులసతి నెడబాసి తొలగి పోవుట మూడు
                         వెలయంగ యాచక వృత్తి నాల్గు
తన సరివారి పంచ చేరుకొనుట ఐదు 
                           గురు తెరుంగని రాజు కొల్చుటారు
చదువు నేర్చక యుండి  సభకు పోవుటేడు
                అష్టక్ష్టములని యేడి నవ్వియివ్వి
                గాన నిటు వంటి మన కిక్కట్లు గాను  
               చారుతర మూర్తి దేవతా చక్రవర్తి
               రమ్య గుణధామ  కావేటి రంగ ధామ .

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS