దండం దశగుణం భవేత్
శ్లో= వి శ్వా మిత్రాహి పశుషు కర్థమేషు జలేషుచ,
తమసి వార్థక్యే దండం దశ గుణం భవేత్.
అర్థము:; వి=పక్షి, శ్వ=కుక్క, అమిత్ర=శత్రువు, అహి=పాము, పశుషు=పశువులను, కర్థమేషు=బురదలోను,
జలేషుచ=నీటిలోను, అంధ్వే=గ్రుడ్డితనములోను, తమసి=చీకటిలోను,
వార్థక్యే=వార్థక్యములోను, దండం=(చేతి) కర్ర,
దశగుణంభవేత్ = పది విధాలుగా ఉపయోగపడుతుంది.
తాత్పర్యము: ౧.కర్ర చేతులో వుంటే పక్షులను అదిలించి కొట్టవచ్చును ,
౨.వీదికుక్కలను అదిలించవచ్చును,
౩.శత్రువులను భయపెట్టవచ్చును,
౪.పాములను కొట్టవచ్చును,
౫.పశువులను అదిలించవచ్చును,
౬.బురదలోనడచునప్పుడు ఉపయోగపడుతుంది.
౭. నీటిలోను ఉపయోగపడుతుంది.
౮. గ్రుడ్డితనంలోను , ౯.ముసలితనంలోను, ౧౦. చీకటిలోను,
దండము ఉపయోగపదుతుంది.
సేకరణ ; మాచిరాజు రమణయ్య. cell. 9440845875
0 comments:
Post a Comment