Container Icon

సామెతలు


సామెతలు
నేడు వాడుకలోనున్న సామెతలు ఎన్నో అసలు రూపం కోల్పోయి వేరేవిధంగా చెప్ప బడుతున్నాయి
        ఉదా: పనిలేని మంగలి పిల్లి తలగొరిగినట్లు.
ఇది నేడు వాడుకలోచాలామంది ఉపయోగిస్తూ వుంటారు.
కానీ దానికి అసలు అర్థమే లేదు. కారణం మంగలి పిల్లి తల గొరగడ మనేది జరగదు. అసలు సామెత ఇది.
      పనిలేని మంగలి పిలిచి తల గొరిగె.
            మాచిరాజు రమణయ్య

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

సాష్టాంగ ప్రణామము.


కం= ఉరసా,శిరసా,దృష్ట్యా,మనసా,వచనా.తథా,
       పదభ్యాం,కరాభ్యాం,కర్ణాభ్యాం ప్రణమోష్టాంగము చ్యతే.
తా=వక్షస్థలము,శిరము, వీనితో భూమిని తాకి, దృష్టితో శివుని జూచి , మనసుతో రుద్రునకు వందనము చేసి మాటచేనమః 
 అని రెండు పాదాగ్రహములు  ఒక్కొక్కటి చొప్పున  రెండు                     చేతులతో   పట్టుకొని నట్లు భావించుచూ రెండు చెవులు నేలకుతాకి బోర్లగిలి నమస్కరించుట. ఇందు కాయికము వాచికము,మానసికములైన,నమస్కారములు అంతర్గర్భితములై యున్నవి. అనగా మనసుతో చింతించుట ,మాటలచే నమః అని ప్రార్థించుట,కాయముచే  బోర్లగిలి నమస్కరించుట ఇందులోని కార్యకలాపము.మరియు,

కం: కరయుగములు,చరణంబులు,
నురము లలాట స్థలంబు నున్నత భుజముల్,
సరిధరణి  మోపి మ్రొక్కగ
బరువడి,సాష్టాంగమండ్రు పరమ మునీంద్రుల్.

తా:  రెండు చేతులు రెండు కాళ్ళు వక్ష స్థలము నొసలు రెండు భుజములు వీనిని నేలకు తాకునట్లు బోర్లగిలబడి నమస్కరించు క్రియా విశేషణ ము కూడా  సాష్టాంగ నమస్కారమని అందురు.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS