Container Icon

దైవమొక్కడే

                                                                       దైవము 

మృత్పింమేకో బహుబాండ రూపా సువర్ణ మేకం బహు భూషణాని

గోక్షీరమేకం బహు దేనుజాతం  ఏకః పరాత్మా బహు దేహ వర్తి.


అరయగ నన్నిరూపముల నందిన మట్టియొక్కటే

కూరెడు స్వర్ణమొక్కటియె కోరి రచించిన భూషలన్నిటన్

వేరుగనున్న గోవుల వినిర్మల దుగ్ధము వర్న్మొక్కటీ

తేరుగా నేన్నిరూపముల దేజములొల్కిన దైవమొక్కటే.


కుండలను పరిశిలీస్తే అన్నిరూపాలను తయారయినది మట్టితోనేకదా.అలాగే వివిధ రకాలైన ఆభరణాలు

తయారు కాబడినప్పటికి బంగారమేమో ఒక్కటేకదా.అనేక రంగులుగల గోవుల పాల రంగు మాత్రము 

తేలుపేకదా.అదేవిధంగా దైవము కూడా బహురూపాలలో బహు విధాలుగా కన్పించి నప్పటికీ స్వరూపము 

మాత్రము ఒక్కటేనని గుర్తించాలి. 


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS