Container Icon

తెలుగు సౌరభం

కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా !

అన్న పద్యపాదాన్ని చక్కని పూరణతో కవి ఈ క్రింది విధంగా పూరించాడు.

భీతమృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మబాధచే,
నాతికి పెండ్లికాదని, వినాశనమౌనని నేస్తులెంచుచున్
జాతకముల్ గుణింపగ, భిషక్కుని సాయము పొంది మందొ, మా
కో, తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!
నవ్వు నాలుగు విధాల చేటని అంటారు కొందరు.కాని అది మంచి మందని కవి ఇలాచెప్పాడు.

. “నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలుకొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

అవసరం లేనప్పుడు మన వద్దకు వచ్చి నీకు నేనున్నాను.ఎప్పుడైనాఏ సహాయమైన చేస్తానని చెప్పే వాడు నిజమైన బంధువుకాడు.స్నేహితుడు కాదు.అవసరానికి ఆదుకొని ఏక్షణాన పిలిచినా వచ్చి ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు.అందుకు నిదర్శనం మాబంధువుకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేర్చాము.ఆయనకు బి నెగెటివ్ ప్లేట్లెట్లు అవసరమై ఎందరినో సెల్ ద్వారా ప్రయత్నించాము.కొందరు అయ్యో నేను ఆఫీసులొ వున్నానే లేకపోతె వెంటనే ఏర్పాటు చేసే వాణ్ని,అని కొందరు,నానా రకాల సాకులు చెప్పారు.అయితే మా అబ్బాయి ప్రకాష్ మిత్రులు శ్రీ మహేష్,రవికుమార్,వెంకటేష్,హరి,ఇర్ఫాన్ గార్లు  మరియు కడలో బ్లడ్ టు లివ్ స్థాపకుడు అయిన నామిత్రుడు పట్టుపోగుల పవన్ కుమార్ గారు వెంటనే స్పందించి స్వయంగా వారి ఖర్చులతో రిమ్స్ ఆసుపత్రికి,మరియు ఫాతిమా మెడికల్ కాలేజికి వచ్చి తమ రక్తాన్ని దానమిచ్చి ఒక వ్యక్తి కి ప్రాణదానం చేసారు.వారు నిజమైన ఆత్మ బంధువులు మరియు నిజమైన స్నేహితులు ఈ సందర్భముగా వారికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తూ మిత్రుడు పవన్ కుమార్ గారికి నాప్రత్యేక ధన్య వాదాలు. దయచేసి ఎవరైనా ఇబ్బందుల్లో వుంటే రక్త దానం చేయండి ఒక ప్రాణం కాపాండండి



.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS