Container Icon

భరత భూమి

                                                    భరత భూమి  

వేద ముఖ్యుల తోడ ,వేదఘోషలతోడ, విలసిల్లు నట్టిదీ వేదభూమి,

రత్నాలరాసులన్ ,రమణీయ శోభతో ,ప్రసరించు నట్టిదీ రత్న  భూమి,

మిస మిస లాడెడు ,పసిడి పంటల తోడ , భాసురంబైనదీ భరత భూమి,

విజయ లక్ష్మిని గొన్న వీరులందరితోడ ,వెలుగొందు నట్టిదీ వీర భూమి,

నిఖిల విఖ్యాత కవులకు నిలయ భూమి ,

సకల విజ్ఞాన ధనులకు జన్మ భూమి ,

అట్టి సధ్బూమిలో హృదయ ముప్పొంగ మమ్ము పుట్టించితివి,

తదృణంబు దీర్ప వందనమ్ము చేతుమో భరత మాత.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నీతి వాక్యములు.



 శాంతి తుల్యం తపోనాస్తి,న సంతోషాత్పరం సుఖం!
న తృష్ణాయా: పరో వ్యాధి: నచ ధర్మో నయానమ:!!
శాంతము వంటి తపస్సు ,సంతోషము కంటే సుఖము, తృష్ణను మించిన వ్యాధి, దయను బోలిన ధర్మము
లోకమున మారేవి లేవని పెద్దల తెలిపిరి.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు తన కుటుంబ ఆదాయము నుండి సగ భాగం తమ పిల్లల చదువులకు ఖర్చు పెడుతున్నారు.వారిలోఆర్ధికంగాపరిపుష్టికలవారు,లేనివారు,చివరకు కూలినాలి చేసుకునే వారు సైతం తమ పిల్లలను కార్పోరేట్  విద్యా సంస్థలలో చేర్పిస్తున్నారేతప్ప ప్రభుత్వ విద్యాలయాలలో  చేర్పించడం లేదు.  ప్రభుత్వ విద్యాలయాలలో  సకల సదుపాయాలూ కల్పించి నప్పటికీ ఎందుకు  తమ పిల్లలను  ప్రభుత్వ విద్యాలయాలలో   చేర్పించడంలేదు. కారణం  కార్పోరేట్  విద్యా సంస్థలలో చదివిన విద్యార్థులు భావిష్యతులో ఉన్నత స్తాయికి ఎదిగి మంచి ఉద్యోగాలు సంపాదించి పేరు ప్రఖ్యాతులు పొంది ఆర్థికంగా తమను ఆదుకుంటారని ఆశతో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. కాని ఎంతమంది నిరుద్యోగులుగా కుటుంబాలకు భారమై వారి చదువులకు చేసిన అప్పులు తీర్చ లేక ఆ తల్లితండ్రులు పడే బాధలు కళ్ళారాచూస్తున్నాము. అదే  ప్రభుత్వ విద్యాలయాలలో చదివినవారు ఎంతోమంది ఉద్యోగస్తులుగా ఉన్నారో ,ఎంత ఉన్నత స్థితిలోఉన్నారో ఎవ్వరికి తెలియదు.                                                   తల్లితండ్రులారా! ఆలోచించండి తెలివికలిగిన విద్యార్థి ఎక్కడైనా రాణిస్తాడు.
ముఖ్యంగా ఈ నాడు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను తాను పని చేసే బడిలో చేర్చడు
వేలు వెచ్చించి కార్పొరేట్ బళ్ళలో చేర్పిస్తున్నాడంటే కారణం తన బోధనపైన  తనకు నమ్మకం లేనట్టేకదా.ఇక ప్రభుత్వ పాటశాలలు ఎలా నడుస్తాయి. అందుకే ప్రభుత్వమోక్ నిరణం తీసుకొని
ఓక చట్టం తేవాలి.
1.ప్రభుత్వ ఉద్యోగి అనగా ప్రభుత్వము ద్వారా జీతము తీసుకొనే ప్రతి ఉద్యోగి తమపిల్లలను

 ప్రభుత్వ విద్యాలయాలలోనే చదివించాలి. 
2.ఇందులో నాలుగో తరతి  ఉగ్యోగి మొదలు గజిటెడ్ ఆఫీసర్ వరకు ఈనిబంధన పాటించాలి.

౩.అలాతమ పిల్లలు ప్రభుత్వ విద్యాలయాలలోనే చదువుతున్నట్లు ఆయా ప్రభుత్వ                            

  విద్యాలయాల నుండి సర్టిఫికెట్ ప్రతి ఏటా తాము పనిచేసే కార్యాలలో సమర్పించాలి.

4.ప్రతి నెలా ప్రభుత్వ పాటశాలల విద్యా బోధనలపై అజమాయిషీ ఉంచాలి.

                            ఇలాచేస్తే కలెక్టరు పిల్లలు మొదలు నాలుగో తరతి  ఉగ్యోగి పిల్లలవరకు   ప్రభుత్వ విద్యాలయాలలోనే  ఉంటారు కాబట్టి ఆయా పాటశాలలు విద్యాబోధనలో చక్కటి ప్రావీణ్యత కనబరచి మంచి ఫలితాలు సాధించి కార్పోరేట్ విద్యాలయాలకంటే మెరుగైన ఫలితాలు చూపగలరని ఆశిస్తున్నాను. అయితే కాసులకమ్ముడుబోయే వారున్నంతవరకు ఇది సాధ్యమా.ఇదే నిజమైతే సామాన్య మానవుడు సైతం తమ పిల్లలకు మంచి విద్య నందించుటకు ఎలాటి ఇబ్బంది వుండదు. ఆలోచిచండి.

 మాచిరాజు రమణయ్య.కడప. 9440846875.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

ఇల్లు లేక యున్న చెల్లి పోవునెట్లో
బట్ట లేక యున్న బతుక వచ్చు నెట్లో
తినగ తిండి లేక మనవచ్చు నెట్టులో

చేత సెల్లు లేక బతుకు కలదె . (నేడు)

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

కర్తా, కారయతా, చైవా, ప్రేరకశ్చ అనుమోదకః.
సుకృతే,దుష్క్రుతే, చైవా చ త్వారస్య మభాగినః.
ఒకపని చేయువాడు,  ఆపనిని చేయుమని ప్రేరే పిం చినవాడు, దానిని సమర్ధించిన వాడు
ఆపని మంచిదైతే  మంచి ఫలితము, చేడుదైతే చెడు ఫలితము సమానంగా అనుభవిస్తారని భావము.
కాబట్టి మంచిని ప్రోత్సాహం చేసి సత్ఫలితాన్ని పొందగలరు.



  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

తెలుగు సౌరభం

కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా !

అన్న పద్యపాదాన్ని చక్కని పూరణతో కవి ఈ క్రింది విధంగా పూరించాడు.

భీతమృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మబాధచే,
నాతికి పెండ్లికాదని, వినాశనమౌనని నేస్తులెంచుచున్
జాతకముల్ గుణింపగ, భిషక్కుని సాయము పొంది మందొ, మా
కో, తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!
నవ్వు నాలుగు విధాల చేటని అంటారు కొందరు.కాని అది మంచి మందని కవి ఇలాచెప్పాడు.

. “నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలుకొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

అవసరం లేనప్పుడు మన వద్దకు వచ్చి నీకు నేనున్నాను.ఎప్పుడైనాఏ సహాయమైన చేస్తానని చెప్పే వాడు నిజమైన బంధువుకాడు.స్నేహితుడు కాదు.అవసరానికి ఆదుకొని ఏక్షణాన పిలిచినా వచ్చి ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు.అందుకు నిదర్శనం మాబంధువుకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేర్చాము.ఆయనకు బి నెగెటివ్ ప్లేట్లెట్లు అవసరమై ఎందరినో సెల్ ద్వారా ప్రయత్నించాము.కొందరు అయ్యో నేను ఆఫీసులొ వున్నానే లేకపోతె వెంటనే ఏర్పాటు చేసే వాణ్ని,అని కొందరు,నానా రకాల సాకులు చెప్పారు.అయితే మా అబ్బాయి ప్రకాష్ మిత్రులు శ్రీ మహేష్,రవికుమార్,వెంకటేష్,హరి,ఇర్ఫాన్ గార్లు  మరియు కడలో బ్లడ్ టు లివ్ స్థాపకుడు అయిన నామిత్రుడు పట్టుపోగుల పవన్ కుమార్ గారు వెంటనే స్పందించి స్వయంగా వారి ఖర్చులతో రిమ్స్ ఆసుపత్రికి,మరియు ఫాతిమా మెడికల్ కాలేజికి వచ్చి తమ రక్తాన్ని దానమిచ్చి ఒక వ్యక్తి కి ప్రాణదానం చేసారు.వారు నిజమైన ఆత్మ బంధువులు మరియు నిజమైన స్నేహితులు ఈ సందర్భముగా వారికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తూ మిత్రుడు పవన్ కుమార్ గారికి నాప్రత్యేక ధన్య వాదాలు. దయచేసి ఎవరైనా ఇబ్బందుల్లో వుంటే రక్త దానం చేయండి ఒక ప్రాణం కాపాండండి



.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS