భరత భూమి
వేద ముఖ్యుల తోడ ,వేదఘోషలతోడ, విలసిల్లు నట్టిదీ వేదభూమి,
రత్నాలరాసులన్ ,రమణీయ శోభతో ,ప్రసరించు నట్టిదీ రత్న భూమి,
మిస మిస లాడెడు ,పసిడి పంటల తోడ , భాసురంబైనదీ భరత భూమి,
విజయ లక్ష్మిని గొన్న వీరులందరితోడ ,వెలుగొందు నట్టిదీ వీర భూమి,
నిఖిల విఖ్యాత కవులకు నిలయ భూమి ,
సకల విజ్ఞాన ధనులకు జన్మ భూమి ,
అట్టి సధ్బూమిలో హృదయ ముప్పొంగ మమ్ము పుట్టించితివి,
తదృణంబు దీర్ప వందనమ్ము చేతుమో భరత మాత.
2 comments:
Great Post !!!! You provided a very amazing info with us .Thanks for sharing this awesome article with us
Latest News Updates
Post a Comment