తెలుగుప్రపంచ మహాసభల సందర్భముగా
తెలుగు భాషాభిమానిగా ఇది నా హృదయ స్పందన .ప్రతితెలుగు సోదరుడు తెలుగు భాషాభి
వృధ్ధికి తన వంతు సహకారం అందజేయాలని కోరు కొంటూ. మాచిరాజు రమణయ్య .
// ఉగ్గుపాలు త్రాపి ఊయలలూపుచూ
అమ్మ నేర్పినట్టి ఆది భాష,
ఆంధ్రభోజుండైన ఆ కృష్ణ విభవుండు
సాటి లేదన్నట్టి మేటి భాష ,
తెలుగు కవుల నోట పలుకులై జాల్వారి
కావ్యాల నిచ్చిన దివ్య భాష
,
దేశ దేశాలలో దేదీప్యమానమై
రాజిల్లనట్టిదీ
రాజభాష,
పంచదారకన్న పాల్మీగడలకన్న
జుంటి తేనెకన్న జున్నుకన్న
అమ్మమనసుకన్న కమ్మనిదీ భాష
తెలుగు వారి భాష తెలుగుభాష //
అట్టి భాష పలుక అవమానమని యెంచి
అన్య భాష కొరకు అర్రు జాపి
తెలుగు వారు నేడు తెగ బడు చున్నారు
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు
.
తెలుగు జాతి మనది తెలుగువారము మనము
తెలుగు మాట లాడి తెగువ జూపి
తెలుగు భాష కొరకు అలుపన్నదెరుగక
పాటు పడగ వలయు నేడుమనము.