దశావతారములు
సలిల విహారులిద్దరును సంతత కానన చారులిద్దరున్
వెలయగ విప్రు లిద్దరును వీరపరాక్రమశాలులిద్దరున్
పొంతుల డాయువాడొకడు భూమి జరించెడివాడు నొక్కడున్
జెలువుగ మీకభీష్ట ఫలసిద్ధి ఘటింతు రానంత కాలమున్
భావము :- సలిల విహారులు = మత్స్య,కూర్మములు,
కాననచారులు = వరాహ, నరసింహులు,
విప్రులు= వామన, పరశురాములు,
వీరపరాక్రమశాలులు=రామ, బలరాములు,
పోలతులడాయువాడు= కృష్ణుడు
భూమిచరించెడివాడొకడు= కల్కి.
0 comments:
Post a Comment