Container Icon

మంచిపద్యాలు.

  // కోడె నాగుకు విషముండు కోరలందె
గుండి తేలుకు విషముండు కొండియందె
పరగ నీగకు విషముండు శిరమునందె
వసుధ నరునకు నిలువెల్ల విషము మిత్ర.//
అన్ని విష జంతువుల కన్నను మానవుడే ప్రమాదకరకుడు.

కవి.వేపురి శేషగిరిరావు.


నేడు గోప్పలకొరకుచాలామంది శక్తికి మించి ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు .
దానివల్ల భవిష్యత్తులో చాలాకష్టాలు ఎదుర్కొన్నవారు ఎందరో వున్నారు.
// గోప్పల కోసం ఎంతో
    గుప్పి  వివాహాలు చేయు గుణమదియేలా
    అప్పులవును తిప్పలవును

    చిప్పలు దారా సుతులకు చేరును సుమతీ.

కవి.N.R.వెంకటేశం



నవ్వులు రకరకాలుగా వుంటాయి.
ఉదా: నవ్వులందు  వివిధ నవ్వులు గలవవి
       పగల బడెడి నవ్వు వగల నవ్వు
పెదవి విడని నవ్వు పెడబొబ్బ నవ్వును
వెకిలి నవ్వు మనసు విరుచు నవ్వు
మోసగిచు నవ్వు ముద్దు గోరెడి నవ్వు
ఎదను రగుల జేయు నేడ్చు నవ్వు
ముగ్ధ మొహనంపు ముసి ముసి నవ్వును //

ఇలా రకాల నవ్వులు వున్నాయి.అయితే కొన్ని కొంపముంచేవివున్నాయి.
ఉదా; నెల మొదటి దినము నెలత భర్తను గాంచి
       నవ్వునవ్వు నొకటి రువ్వెనేని
       పట్టుచీర కొరకో పసిడి దండ కొరకో కాని
       ఎసరు పెట్టినట్టు  లెంచ  వచ్చు.

కవి.ఇలపావులూరి సుబ్బారావు.

                                                                   సేకరణ మాచిరాజురమణయ్య.











  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment